Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Pakodi Day :: 18-May-2024 ::
Day అంత చాలా ఎండగా ఉంది. 4 అయ్యేసరికి Climate అంత romantic గా నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసి, చల్లటి గాలి వీస్తూ... చాలా బాగుంది. Balconyలో కూర్చుని అలా అలా మాట్లాడుకుంటున్నాం. ఈలోపు చినుకులు పడటం start అయ్యాయి. కాసేపటి తర్వాత ఇద్దరి నుంచి ఒకటే మాట ఒకేసారిగా.అది ఏంటి అంటే నేనేమో వేడిగా పకోడీ వెయ్యొచ్చుగా అని. తను కూడా అదే ఆలోచనలో పకోడి వెయ్యనా అని. అంతే వెంటనే Start చేసాం....
పెళ్లి అయిన తరువాత First Time వేడి వేడి పకోడి వేసింది Vasudha. ఎలా ఉంటుందో అనుకున్నా. కాని పర్లేదు బాగానే వేసింది. నేను కూడా ఈరోజు Holiday కావడంతో అలా kitchen లోకి వెళ్లి చిన్న చిన్న Help చేశా గరిట పట్టుకుని. హాహాహా . మా అక్క వాళ్ల పిల్లలు ఉన్నారు ఇంట్లో. నిజం చెప్పాలి అంటే వాళ్ల కోసమే వేసింది. నా కోసం అనుకున్నారా..!!?? హాహాహా... . ఇక్కడ వరకు అంతా సరదాగానే జరిగింది కలిసి పకోడిలు వేసుకోవడం... ఇప్పుడు తినడానికి plates లో పెట్టేటప్పుడు అలా కాదు ఇలా పెట్టు అని చిన్న మాట అన్నాను అంతే....ఇక తెలిసిందే గా అప్పటివరకు చల్లగా వీచే గాలి ఈదురు గాలిలా మారి అలా అలా చాలాసేపటి తరువాత అందరం కలిసి వేడి వేడి గా తినేసాం.
ఇలా వర్షం పడుతుండగా వేడి వేడిగా పకోడి లేదా మిర్చి బజ్జిలు తినడంలో ఆ కిక్కె వేరు కదా. ఇలాంటి Memories ని ఇలా రాసి దాచుకుని మల్లి వచ్చే రోజుల్లో ఈ Memoryని చదువుతూ మల్లి పకోడి వేసుకుని తినడం అంటే ఆ ఫీలింగే వేరు...
- MNRVS Diary
I hope pakodi tastes good ???? share with us next time ????
V.V.S Manogna