Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Driving స్కూలుకి వెళ్తున్నా ... (కారు ఎప్పుడు కొంటానో ) ::
అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్లాను చదువుకునే స్కూల్ కి మళ్లి ఇప్పుడు వెళ్తున్నాను నడిపించే Driving స్కూల్ కి...చిన్నప్పుడు నేర్చుకున్నాను Dady నేర్పిస్తే రెండు కాళ్ళ మీద నడక తర్వాత నేర్చుకున్నాను. అన్నయ్య నేర్పిస్తే రెండు చక్రాలు బండి.... మళ్లి ఇప్పుడు ఈ స్కూల్లో నాలుగు చక్రాలు బండి నేర్చుకుంటున్న...
బైక్ నేర్చుకునే సమయానికి సొంత బండి కొనుక్కునే సమయానికి చాలా gap వచ్చింది . కానీ ఇప్పుడు కార్ నేర్చుకునే సమయానికి సొంత కారు కొనుక్కునే సమయానికి ఎంత gap వస్తుందో నాకైతే తెలియదు... అంటే ఆ Bike అమ్మ డాడీ Gift అనుకో... హాహాహాహా … అలా సొంత బైక్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చింది డబ్బులు మళ్ళీ కారు కొనుక్కోడానికి కూడా డబ్బులు అడిగితే కొడుతుందేమో... Hahaha....
ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే మొదట్లో ఎవరికైనా కొంచెం భయమనేది ఉంటుంది Same ఆ భయం నాకు ఈ రోజు కలిగింది… కానీ తెలియని ఏదో ఒక కొత్త ఉత్సాహం అనే ఫీలింగ్ అయితే కలిగింది …
మొదట్లో ఏదైనా కష్టమే... Clutch , Accelerator , Brake మధ్య కాళ్లు మార్చడానికి కొంచెం లాగినట్టు అనిపించాయి... నేర్చుకునేటప్పుడు మనకి వస్తుందో రాదో ఎలా నడుపుతానో అని అనిపించడం సహజం కదా. అలాగే అనిపించింది నాకు వస్తుందా Driving మంచిగా అని... Present ఐతే అస్సలు confidence లేదు... నేర్చుకోగా నేర్చుకోగా కొంచెం అలవాటు అయ్యాక చూడాలి... ఎలా ఉంటుందో...
Driving Bro చెప్పాడు... Mirror చూసుకుంటూ ఉండాలి అని .... కానీ నేను ఒక్కసారి కూడా చూడలేదు Mirror వైపు... మొదట్లో ఇలా తప్పులు చెయ్యడం చాలా సహజం... అలా అని బయపడి మానేస్తే ఇంకెప్పుడు రాదుగా నాలుగు చక్రాలను నడపడం...
వెళ్ళాలి మల్లి రేపు... రేపు ఐతే నడుపుతూ Mirror చూడటానికి Try చేస్తా…
All the best bavagaru????... Be safe????....
Lalli...