Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
హలో అండి....
నేను మౌనిక ని... 2010-11 బ్యాచ్..
మీలో ఎంతమందికి నేను గుర్తున్నానో తెలీదు కానీ..
నాకు మాత్రం అందరు అలాగే మనం గడిపిన మధుర క్షణాలు అన్నీ గుర్తున్నాయ్...
అవన్నీ మీతో షేర్ చేస్కోవాలి అనుకుంటున్నాను .
ఆ జ్ఞాపకాలు అన్నీ ఇప్పుడు తలుచుకుంటే కళ్ల ముందే కనిపిస్తున్నాయ్..
ఎందుకంటే మన ఆనందాన్ని మనమే గుర్తుచేసుకుంటుంటే కలిగే ఆనందం రెండు ఇంతలు అవుతుంది.
ముందుగా మన స్కూల్ ఓపెన్ గ్రౌండ్..
సైకిల్స్ పార్కింగ్ ప్లేస్..
నా సైకిల్ నా ఫ్రెండ్ మ్యాగీ పక్కనే పెట్టేదాన్ని ఫస్ట్ నుండీ..
తరవాత లంచ్ చేసే చిన్న గ్రౌండ్...
మామిడి చెట్టు...
నాకు ఇష్టమైన అశోక చెట్లు ఉన్న ప్లేస్..
స్టెప్స్ ఎక్కుతుంటే గోడ గడియారం..
స్కూల్ అసెంబ్లీ మరియు బ్లూ అండ్ వైట్ యూనిఫాం..
Red Yellow Green Blue గ్రూప్లు... నాది గ్రీన్ గ్రూప్.
గ్రూప్ కి కప్పు గెలుచకోవడం కోసం చేసే పోటీలు..
పైన ఉండే సెమినార్ హాల్..
రెండు జడలు బ్లూ రిబ్బన్స్ తో..గాసిప్స్????..
Sister.Selvi,
Sister.Vandana,
Sr. రోసీనా,
మేరీ రాణి మిస్ మాటలు,
శోభా రాణి మిస్ గ్రూప్స్ కి ఇచ్చే మార్కులు,
యాని మిస్ నవ్వులు,
శ్రీ వల్లి మేడమ్ వాయిస్,
శివ ప్రసాద్ సర్ తో తిట్టించుకోవడం.
సిస్టర్ .దీప్తి ప్రతి లెస్సన్ కీ ఇచ్చే Introduction.
శిరీష మిస్ అందర్నీ బాయ్స్ నీ లడ్డు, బొట్టు అబ్బి అంటూ పిలవడం.
వర్ధిని మిస్ ఎన్.ఎస్. చెప్పడం.
Ali sir PS paper correction చేసి one day lo ఇస్తే వచ్చే దడ.
Buela madam క్లాస్ లో ఇచ్చే ర్యాంక్స్ ,
మా లాస్ట్ బెంచ్లోకి వచ్చే ముచ్చట్లు????
ఎక్జామ్ అంటే ఇన్డివిజువల్ స్టడీస్ అని కంబైన్డ్ స్టడీస్ అని....
అంటే ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది… Hahaha
అమ్మాయిలు అందరం ఉన్న పేర్లు సరిపోక మోహన్ రావు అని, చందర్ రావు అని, దుర్గారావు అని, అబ్బాయిల పేర్లతో పిలుచుకోవడం.
ఒకరికి చిన్న సమస్య అయిన ఇంకొకరు కల్మశం లేకుండా సహాయం చేయడం.
PET పీరియడ్ కోసం ఎదురుచూస్తే భాను మేడం గ్రౌండ్ చుట్టు 3 రౌండ్లు వేయించేవారు????.
స్కూల్ కి టైం అయ్యాక రావడంతో వచ్చే లేట్ కమర్ అనే బిరుదు.
ప్రత్యేకంగా మాది????♀️సైకిల్ బ్యాచ్ అన్నమాట..
సుప్రియ, మేఘన, చాందిని, నేను, జ్ఞానిషా, పావని, శుభ శ్రీ, మోహిత, కుసుమ, వాలెంటినా, అందరం కలిసి వెళుతూ ఉండే వాళ్లం.
అప్పట్లో సైకిల్ బ్యాచ్ అని పెద్ద పేరులే స్కూల్ లో.. శివ సైకిల్ చైన్ బ్యాచ్ లా ...
అలా ఇంత మంది కలిసి వెళ్తూ స్కూల్ నుండి స్టార్ట్ అయ్యి ఇంటి వరకు ఒక్కక్కరు విడిపోతూ వెళ్లే వాళ్లం..
ఇలా చెప్పుకుంటూ పోతే.. .చాలా విషయాలే ఉన్నాయ్... అన్ని కళ్ల ముందే గుర్తొస్తున్నాయ్..
మళ్లీ మీ అందరిని చూడాలని ఉంది...
Thanks for the Alumni meet.
ఈ మెమోరీస్ అన్ని స్కూల్ లో ఉండే ప్లేసెస్ చూస్తూ.. గుర్తు తెచ్చుకోవడం అంటే సూపర్ కదా అస్సలు.
త్వరలో కలుద్దాం...
మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నా..
E Cycle batch chaala famous anukunta.... Nice memory.
Mihs
Yes మనమే సైకిల్ బ్యాచ్
Ramu shree gnanisha