Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
Hey Hi Nenu Mee Manoj, Manoj Sai Ram.
బహుశా ఇలా చెప్తే.. మీకు అర్థం కాకపోవచ్చు.
పోనీ ఇలా చెప్పమంటారా?
2007లో ఫస్ట్ క్వార్టర్ లో ఎవరో హెల్ప్ చెయ్యమంటే.. నమ్మి నా రెడ్ ఫోటాన్ సైకిల్ ఇచ్చి పోగొట్టుకున్న సెవెంత్ క్లాస్ అబ్బాయిని..
నేనేమో తెలియదు కానీ,
మా అక్క నీ అయితే ఇలాగే పిలిచేవారుగా..
పాపం తను!
చదివింది మూడేళ్లయిన.. ఏంటో ఈ అనుబంధం!
స్కూల్ Alumni అనగానే మనస్సుకి రెక్కలు వచ్చిందో ఏమో! కాలం ఎప్పుడు పరిగెడుతుందా అని ఆశగా ఎదురుచూసాను. కుదిరితే కాలం ముక్కు పట్టి అందర్నీ కలిసే ఆ రోజుకి లాక్కొని వెళ్లాలనిపిస్తుంది.
శేఖర్ కమ్ముల సినిమాలు చూసినప్పుడల్లా మన శిరీష మిస్ గుర్తొస్తారు.
మనస్సు మంచిదైతే మాట బాగుంటుంది అంటారు.
అయితే మంచి మనస్సు, మంచి మాట రెండు కలిపితేనే మా శిరీష మిస్.
శిరీష మామ్ మమ్మల్ని చదివించే విధానం నాకు చాలా ఇష్టం.
మాకు మార్కులు రావడం కోసం ఆవిడ కష్టపడుతూ.. పాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ ని పట్టుకుని ..
మాతో చదివించే ప్రయత్నం మామూలు విషయం కాదు.
I bet,
At worst case... Least mark will be 60+.
చాక్లెట్ కావలా? చదివి చూపించు! అంటారు.
ఆ ఏజ్ లో చాక్లెట్ మించిన గిఫ్ట్ ఏముంది?
She knows our pulse.
Missing you Sirisha mam.
And Thank you so much.
చాలా స్కూల్స్లో చూస్తూ ఉంటాము. ఫీజు కట్టకపోతే క్లాసెస్ లోకి రానివ్వకపోవడం,
ఎగ్జామ్స్ కి allow చేయకపోవడం.
కానీ మన స్కూల్ లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఎకనామికల్ గా హెల్ప్ చేసేవారంటే ఆలోచించండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్సియల్ సిట్యుయేషన్ ని అర్థం చేసుకునేవారు.
Especially Sister Selvi, Sister Bennett.
A very special thanks to both of them.
ఉన్నప్పుడు ఎవరు విలువ తెలియదండి. అది ఏంటో?
మనుషులు దూరం అయ్యాక వాళ్ళ విలువ తెలుస్తుంది. అలాగే స్కూల్ వయస్సు దాటి బయటికి వెళ్తుంటే.. ఏదో తెలియని స్వేచ్ఛను అనుభవించబోతున్నాము అనుకున్నాము.
కానీ... స్కూల్ చదువుతున్నప్పుడు ఉన్న సంతోషం, స్వేచ్ఛ , స్వచ్ఛత తర్వాత ఉండదన్న విషయం తరువాతే తెలిసి వస్తుంది.
ఎవరిని mention చేసి ఎవర్ని mention చేయకుండా పోతానో అని చాలా భయం వేస్తుంది.
హా... భానుమతి మామ్. ఆవిడ లేకపోతే స్కూల్లో ఎలాంటి ఎక్టివిటీస్ జరిగనే జరగవు.
గేమ్స్, స్పోర్ట్స్, కరాటే, ఆక్టివిటీస్ అన్ని ఆవిడ ఒక్క చేతితో లాక్కొచ్చేది.
మా స్కూల్, నేషనల్ స్పోర్ట్స్ దాకా వెళ్ళాము అంటే.. అది భానుమతి మేడం గొప్పతనం మాత్రమే.
She is an inspiration to all the women.
నైన్త్ క్లాస్ లో నేను చేసిన క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా గుర్తుండిపోయింది.
ఎప్పుడో ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్న క్లాసికల్ డాన్స్.. ఇలా నైన్త్ క్లాస్ కి ఉపయోగపడుతుందని అనుకోలేదు.
చాలా స్పెషల్ గా గడిచిపోయింది ఆరోజు. ఒక్క క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ మాత్రమే అనుకుంటే, స్కిట్ కోసం గౌతమ బుద్ధుడు కావాలని.. ఎవరిని తీసుకోవాలో తెలియక అందరూ సతమతమైపోతుంటే.. సిస్టర్ బెంటన్ మాత్రం..
ఏమాత్రం ఆలోచించకుండా నా పేరు చెప్పారు.
నార్మల్ గా అయితే డాన్స్ వేసే వాళ్ళకు, స్కిట్ లో ఛాన్స్ ఇవ్వరు. కానీ సిస్టర్ బెంటన్ ఆరోజు నన్ను పర్మిట్ చేసేసరికి... I felt blessed
ఒకరు ఇష్టం ఒకరు ఇష్టం లేదు అంటూ లేనేలేదు.
స్కూల్ అనగానే నాకు గుర్తొచ్చేది .. మాథ్స్ శివప్రసాద్ సార్,
శ్రీవల్లి మిస్,
సిస్టర్ సెల్వి,
సిస్టర్ వందన,
ఎన్ ఎస్ సిస్టర్ దీప్తి.
అందరూ ఇష్టమే..
సిస్టర్ దీప్తి గారి టీచింగ్ వల్లనే నేను క్రిస్టియానిటీ వైపు అడుగులు వేశానని చెప్పవచ్చు.
మన చిన్నతనంలో వేసిన బీజాలే కదా, మన ప్రవర్తన, మన నడవడికకు మూలం.
అలాగే ఈరోజు నేను ఇలా M.Tech చేసి మీ ముందు ఉన్నాను అంటే.. దానికి కారణం మాత్రం మన మేరీ ఇమాక్యులేట్ స్కూల్ .
శ్రీశ్రీ గారు చెప్పినట్టు మరో ప్రపంచం అంటూ ఎక్కడైనా ఉంది అంటే.. అది మా స్కూల్ లో రెండు చోట్ల ఉందనే చెప్తాను.
Chapel! and Mango tree!
లంచ్ అవ్వగానే చాపెల్ కు వెళ్లి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న చాలు. అలా blessings shower అవుతున్న feeling వచ్చేది. ప్రశాంతతకి మారుపేరు.
మనశ్శాంతినిచ్చే మరవలేని చోటు. I used to accompany myself there every day.
సీనియర్స్ పేరు చెబుదామని మొదలుపెట్టాను కానీ.. ఒకరా? ఇద్దరా? I was loved by everyone.
జూనియర్స్ గురించి చెప్పనే అవసరం లేదు. అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరిగేవారు.
స్కూల్ వాతావరణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్కూలు జ్ఞాపకాలలో గుర్తు ఉన్నవి చెప్పవోయి మనోజ్ అంటే..
అస్సలు ఏమి గుర్తు లేవని అని ఆలోచించాల్సి వచ్చింది. అన్నీ గుర్తొస్తున్నాయి.
నాకు తెలిసి అందరికీ మామిడి చెట్టే గుర్తుంటుంది.
నాకు మాత్రం వెనుక గేటు నుండి వెళ్తున్నప్పుడు కనిపించే పాములు.
అలాగే స్కూల్ నుండి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించే చెరువు.
అన్నీ గుర్తున్నాయ్యండి బాబు!
అదేమిటో స్కూల్ ని తలుచుకోగానే ఒక మ్యాజికల్ మూమెంట్ లోకి వెళ్ళిపోతాను.
స్వీటెస్ట్ మెమరీ ఐ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్.
Thank you so much for everything dear School
Manoj Sai Ram
2011-2012