Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
నేను యూకేజీలో జాయిన్ అయినప్పుడు, సిస్టర్ సెరీనా HMగా చేసేవారు.
నేను ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు నన్ను ఆ మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్లి, మామిడికాయ కోసి ఇచ్చేవారు.
అప్పుడప్పుడు రెడ్ చాక్లెట్ అండ్ గ్రీన్ చాక్లెట్ కూడా ఇచ్చేవారు.
నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు సిస్టర్ సెరీనా నాకు డాన్స్ నేర్పించారు.
తర్వాత, నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు సిస్టర్ బెన్నెట్ HMగా చేస్తున్నప్పుడు.. నేను ఒక సినిమా పాటకి డాన్స్ పర్ఫామ్ చేశాను. నాకు బాగా గుర్తుంది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
అలాగే సెవెంత్ క్లాస్ వచ్చినప్పుడు సిస్టర్ వందన, సిస్టర్ సెల్వి హెడ్ మిస్ట్రైస్ గా పని చేస్తున్నప్పుడు..
సిస్టర్ మీనా మాకు నేర్పిన స్కిట్ డాన్స్ ఇప్పటికీ మర్చిపోలేము. అప్పట్లో సిస్టర్ మీనా గారు available లేకపోయినా..
ఎలాగో అలా సిస్టర్ మీనాని తీసుకొచ్చి స్కిట్ డాన్స్ మాత్రం నేర్పమని చెప్పేవారు.
భాను మిస్ వెళ్ళిపోయిన తర్వాత పి. ఈ. టి సార్ ఎవరు లేకపోవడం. అప్పుడే ఏదో స్పోర్ట్స్ కాంపిటేషన్ లో ఎలా రా బాబు అనుకున్న సమయానికి.. అప్పుడు వచ్చారు.. మా క్లాస్ బాయ్స్!
మాకు ట్రైనర్స్ లాగా మారి.. త్రో బాల్ నేర్పించారు.
ఈరోజు మేము ఇలా ఈవెంట్ ఆర్గనైజర్ గా చేస్తున్నాము అంటే.. దానికి కారణం మన స్కూలే!
ఇమాక్యులేట్ స్టూడెంట్ అంటే Discipline కి మారుపేరు అని గొప్ప పేరు ఉంది.
మేరీ ఇమాక్యులేట్ స్కూల్ నుండి వచ్చిన స్టూడెంట్స్ అనగానే..
Well mannered, well disciplined, well behaved అని అందరికీ తెలిసిన విషయమే!
అలా అందరు మమ్మల్ని Mary Immaculate School స్టూడెంట్స్ అని అడ్రస్ చేస్తున్నప్పుడల్లా చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే వాళ్ళం.
మేరీ ఇమాక్యులేట్ స్కూల్ స్టూడెంట్ అంటేనే..
ఫలానా అబ్బాయి /అమ్మాయికి ఏమి నేర్పించనవసరం లేదు అని...
ఫలానా అబ్బాయి/అమ్మాయికి ఏం చెప్పాలో చెప్పనవసరం లేదు అని...
అనుకునేవాళ్లు. దానికి కారణం, మేరీ ఇమాక్యులేట్ స్కూల్ స్టూడెంట్స్ అన్నీ నేర్చుకునే బయటికి వస్తారు అని గట్టి నమ్మకం.
కొన్ని సందర్భాల్లో , ఎవరినైనా చూసి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా స్టూడెంట్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ స్కూల్ అన్న స్టాంప్ ఉండేది. ఇది నేను చూసా.
సిస్టర్ దీప్తి ల్యాబ్ కి తీసుకు వెళ్లి పాములు, ఇన్సెక్ట్స్ అన్ని చూపించేవారు. చాలా ఇంటరెస్టింగ్గా ఉండేది.
హే!
మీకు తెలుసో? లేదో?
మన స్కూల్లోనే సెవెన్ ఇయర్స్ క్లాసికల్ డాన్స్ ఫ్రీగా నేర్చుకున్నాను.
ఫీజులు ఉండేవి కావు.
ఒకవేళ ఉన్నా, చాలా తక్కువ ఉండేది.
ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అంటూ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే నేను నేర్చుకోవడానికి కారణం అయ్యింది.
నైన్త్ క్లాస్ లో త్రీ పర్ఫామెన్స్లు ఇచ్చాను.
ఎవరికైనా ఎక్స్ట్రా క్లాసెస్ పెడితే చిరాగ్గా ఉండేది.
కానీ, మేము సండే కూడా క్లాసెస్ కోసం ఎదురు చూసే వాళ్ళం.
మేము అందరం కలిసి చాలా సరదాగా ఉండే వాళ్ళ.
మేము గడిపిన ఆ క్షణాల్లో ఫేర్వెల్ కూడా ఒకటి.
టీచర్స్ అందరికీ మా బ్యాచ్ చాలా స్పెషల్.. ఫేవరేట్ అనే చెప్పాలి.
శోభ రాణి తో memories. Especially నన్ను బీర్బల్ అని పిలిచేవారు.
శీరీష మిస్ చదివించే విధానం, తెలుగు మిస్ దెబ్బలు ఇప్పటికి గుర్తు వస్తాయి.
మరుపురాని జ్ఞాపకాలన్నీ మళ్ళీ తలుచుకోవడానికి.. ఇలా ఒక Alumni కార్యక్రమాన్ని చేస్తామని..
దానికి నేనే ఆర్గనైజర్ గా ఉంటానని.. కలలో కూడా ఊహించలేదు.
కాకపోతే టీచర్స్, సీనియర్స్, జూనియర్స్, నా తోటి క్లాస్ మేట్స్..
అందర్నీ కలిసి మళ్ళీ ఆ మెమరీస్ లోకి టైం ట్రావెల్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ...
సిద్ధంగా ఉన్నాను.
మరి మీరు?
- Reethu Varsha