Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
హల్లో అండి ....
నా పేరు జ్ఞానిష..
అందరికీ గుర్తుకు ఉండే ఉంటాను...
ఎందుకంటే అన్ని activities లో ముందు ఉండేదానిని....నేను నా LKG నుండి 10 వ తరగతి వరకు...
స్కూల్ లో చదివాను....ఈ రోజు నాకు ఇంగ్లీష్ అనేది fluent గా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నాకు మన స్కూల్ ఇచ్చిన వరం అని ఈ రోజు కి గొప్పగా చెప్పుకుంటాను....
Sisters తీసుకున్న care చాలా వర్ణనాతీతం అయినది ..ఎందుకంటే ఒక సారి నేను Lunch box తెచ్చుకోలేదు....ఆ రోజు Sister Selvi చూసి నన్ను Chapel house కి తీసుకువెళ్ళి food పెట్టారు...
అలాగే "MANGO TREE" అనేది అందరికీ ఎంతో మెమరీ. నాకు మా అమ్మ గారు నడుచుకు వచ్చి lunch break అయిపోయాక భోజనం తినిపించారు...ఇంకా మరిచిపోలేని తీపి గుర్తు.... అలానే శిరీష miss నాకు బాగా గుర్తు.. మాకు ఇంగ్లిష్ క్లాస్ జరుగుతుండగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయ్యారు..అప్పుడు మేము 2nd క్లాస్ చదువుతున్నాం...బహుశా 2002 సంవత్సరం అయి ఉంటుంది..నాకు ఇప్పటికీ శిరీష miss ఇచ్చిన demo క్లాస్ post box గురించి ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది....
ఇంకా కల్చరల్ activities లోకి వస్తే సింగింగ్ లో ఎప్పుడు ముందు ఉండే దానిని..దాని తోడుగా శ్రీవల్లి miss ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు..
అలాగే నాకు biology అంటే ఎంత ఇష్టం కలగడానికి కారణం కేవలం sister Deepthi గారి classes....అలాగే Mary Rani miss ఎప్పుడు కూడా నాతో ఫ్రెండ్లీ ఉంటు నేను depressed stage లోకి వెళ్లకుండా మంచి గా suggestions ఇస్తూ ధైర్యం చెప్పే వారు...అలాగే భాను miss మమ్మల్ని కాకినాడ district level sports గురించి తీసుకువెళ్ళారు..ఆ స్టేడియం వైపుగా వెళ్ళినపుడు భాను miss గుర్తుకు వస్తారు..ఈ రోజుకి కూడా....
ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తె ఎంత ఇష్టం అంటే ఒకరికి ఒకరు ఏదైన గొడవ వస్తె ఎడిచేసే వాళ్ళం ఒకరికోసం ఒకరం...10త్ క్లాస్ కి వచ్చాక ఈవెనింగ్ అందరం..ఫ్రెండ్స్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం...ఎవరిది అయిన ఫ్రెండ్ ది..సైకిల్ గాలి పోయి ,పంక్చర్ పడితే మేము కూడా మా సైకిల్ tyre గాలి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇంటికి...
గ్రూప్స్ లో రెడ్ గ్రూప్ నాది..ఫస్ట్ రెడ్ గ్రూప్ లీడర్ స్వామి Annaya ఇప్పటికీ గుర్తు నాకు...ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...నాకు స్కూల్ అనేది నా లైఫ్ లో ఒక బెస్ట్ phase ani ee roju ki చెప్పుకుంటాను....
కల్మషం లేని ఫ్రెండ్స్ నీ నాకు స్కూల్ ఇచ్చింది...మంచి గురువులను ఇచ్చింది...నా జ్ఞాపకాలను వర్ణించడానికి ఈ ఒక్క పేజీ సరిపోదు....ఎందుకంటే నేను స్కూల్ లో గడిపిన సంవత్సరాలు ఒకటా రెండా ఏకంగా 12సంవత్సరాలు....
గురువులు అందరికీ నా నమస్కారములు..అందరినీ ఎప్పుడు కలుస్తాన అని ఉంది..teacher's,sisters ,friends, senior's,juniors అందరినీ చూసి చాలా సంవత్సరాలు అయింది...ఆ రోజుల ఊసులకు టైం సరిపోతుందో లేదో. ..
Dear Sisters....
Thanks for Alumini meet
ఇట్లు
Gnanisha
(2010-2011)