Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
పొద్దున్నే లేచి అలా బయట కూర్చుని చూస్తున్నా... పిల్లలు అందరూ Schoolకి వెళ్తున్నారు. వాళ్లంతా Auto దగ్గర Happyగా నవ్వుతూ ఆడుకుంటున్నారు. 2, 3, 4 class పిల్లలు. వాళ్లను అలా ఆనందంగా చూస్తుంటే, నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి నాకు తెలీకుండానే చిన్న Smile వచ్చింది. అప్పుడున్నంత ప్రశాంతం , ఆ నిజమైన ఆనందం ఇప్పుడు ఎందుకు ఉండవు అని ఆలోచిస్తే ఇలా అనిపించింది. ఎందుకంటే అవి ఆశ లేని రోజులు. ఆశ అంటే అమ్మాయి కాదురా బాబు. ఇక్కడ ఆశ అంటే కోరికలు, బాధ్యతలు, ఆలోచననలు ఇలా అన్నమాట. 😜
Age పెరిగేకొద్ది కోరికలు పెరుగుతాయి. ఎలా అంటే... High Schoolకి రాగానే పక్కవాడి కంటే ఎక్కువ మార్కులు రావాలి అనే ఆశ. ఈ ఆశ వాడంతటి వాడికి వస్తే దాన్ని మంచి ఆశ అంటారు. అంటే అందమైన ఆశ అంటారు.🤣 అదే ఇంట్లో అమ్మానాన్న ఆ ఆశను పుట్టిస్తే అది అందంగా ఉండదు. అందం లేని ఆశతో Happiness ఉండదు.
10th classకి రాగానే 90% పైన రావాలి అనే ఆశ.... School first రావాలి అనే కోరిక... Collegeకి రాగానే ఒక అందమైన GirlFriend కోసం ఆలోచనలు... College ఐపోగానే ఒక పెద్ద Job, Money కోసం కోరికలు, Teenageలో తన Friendలా rich గా enjoy చెయ్యాలి అనే ఆశ.., పెళ్లి అయ్యాక వేరొకరిలా ఆస్తులు కొనాలి, పిల్లల్ని పెద్ద schoolలో join చెయ్యాలి అనే బాధ్యతలు... ఇలా అన్ని ఆశలే.
ఆశలేని జీవితం అంటే అవి చిన్నతనం రోజులే.... నిజమైన నవ్వులు అంటే అది ఆశ లేనప్పుడే. ఆశ ఉండటం సహజం. కానీ ఆ ఆశతో పరుగులు పెట్టడం మొదలు పెట్టాం అంటే, ఆనందం కోల్పోవడం మాత్రం నిజం. ఒక్కసారి ఆశ లేని జీవితాన్ని గుర్తుచేసుకుంటే అంతా ఆనందమే...
అలా ఆలోచిస్తుండగా... School Auto వెళ్లిపోయింది. Job Time అవుతుంది. వెళ్లాలి అనే ఆలోచన ఒక్కసారిగా (ఈ ఆలోచనలో, కోరికలు, ఆశలు , బాధ్యతలు అన్నీ ఉన్నట్టే కదా మరి ).... అర్ధమైందా..!!!???? 😦🤣😂😅
ఏంటో..... ఏంటేంటో....................!!!!!!!!!!!!!