Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
ఇప్పటికి 20 Pages complete చెయ్యగలిగాను... బాగుంది Book చదవడానికి....
ఈ Book లో ముఖ్యంగా 4 విషయాలు గురించి ఉంది...
1. The Self
2. The Story
3. The Philosophy
4. The Team.
ఇప్పుడు మనం First Part The Self లోనే ఉన్నాం.... ఇందులో నేను ఇప్పటివరకు చదివిన విషయాలు గురించి చెప్తాను...
CEO గారు ఏమంటున్నారంటే... మనం 5 బకెట్లు గురించి తెలుసుకుని వాటిని నింపుకుంటే మంచిది అంటున్నారు. అవి ఏంటి అంటే
1. మనకేమి తెలుసు
2. మనం ఎం చెయ్యగలం
3. మనకి ఎవరు తెలుసు
4. మనకి ఏముంది
5. వాళ్లు మనగురించి ఏమనుకుంటున్నారు.
మన Life లో ఏ విషయంలో Success అవ్వాలన్నా ఈ 5 బకెట్లు గురించి తెలుసుకుని మొదలుపెడితే చాలా మంచిది అంట..
ఎందులో ఐనా మనం King లా అవ్వాలి అంటే... Oka Ideaని మనం explain చెయ్యగలగాలి.. అది ఎవరికైనా చెప్తే వాళ్లకి అర్ధం అవ్వి తిరిగి మనకి explain చెయ్యగలగాలి అంట. అది అనుకున్నంత Simple కాదు... ఒక Ideaని Simplify చేసి చిన్నపిల్లాడికి చెప్పినట్టు గా Easy words ఉపయోగించి, వాటిని రాసుకోవడం వల్ల ఆ Idea ఇంకా develop అవుతుంది అంట....
ఒక Technique గురించి చెప్పారు. Fynman Technique. ఇది ఏంటి అంటే... ఎందులో ఐనా Master అవ్వాలి అంటే అది అందరి ముందు చేసి continuous గా చేయడాన్ని Fynman Technique అంటారు అంట.
CEO గారు కూడా మొదట్లో తను 18 years ఉన్నప్పుడు ఒకసారి school లో Stage మీద ఏదో speech ఇవ్వబోతు తడపడ్డారు అంటా... అప్పుడు తను ఏదైనా మాట్లాడాలి అంటే దాని గురించి పూర్తిగా research చెయ్యడం వల్ల దాని గురించి Knowledge పెరిగి Stage మీద మాట్లాడానికి confidence వచ్చేది అంట. అలా అలా తనకి తాను improve చేసుకుంటూ... ఇప్పుడు ఎన్నో countries లో Stage మీద మాట్లాడటం, ఎంతోమంది పెద్ద పెద్ద business persons ని Founders ని interview చేసి వాళ్లు ఎలా success అయ్యారు అని..ఇలా తన experience మొత్తంలో ఎం తెలుసుకున్నారో చెప్పడమే ఈ The Diary of a CEO.
- - మళ్లి కలుద్దాం.