Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

The Diary of a CEO

Page No: 1 | Views: 294 |  0

అలా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ లో ఒక పుస్తకాల షాప్ కనిపించింది అలా కనిపించిన వెంటనే బుక్ షాప్ కి వెళ్లి ఏం కొనాలో తెలియదు అసలు కొనాలని కూడా నాకు ఒక ఆలోచన లేదు. సర్లే చూద్దాంలే అని అలా చూస్తూ ఉన్నప్పుడు కనిపించింది ఈ బుక్. The Diary of A CEO. నాకు చాలాసార్లు అనిపించేది ఈ కంపెనీ CEOలందరూ ఎలా ఆలోచిస్తారు వాళ్ళు company affairs ని ఎలా ఆపరేట్ చేస్తారు అని.

అలా ఈ Book కొన్నాను. నాకు తెలుసు కొన్నంత simple కాదు చదవడం అంటే... క్రమం తప్పకుండ పూర్తిగా చదువుతూ అందులో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకుని నేర్చుకోవడం, పాటించడం అంటే చాలా motivation ఉండాలి అని. 

కొన్న రోజునే ఎక్కువ ఉత్సాహం Motivation ఎక్కువ ఉంటుంది కదా... హాహాహా... 4 pages చదివాను. తెలిసినట్టు గానే రెండో రోజూ అంత ఉండదు. ఏదొక కారణం ఉంటుంది చెప్పుకోవడానికి నిజానికి లేకపోయినా సరే. హాహాహా .... చదవలేదు. ఈరోజు Third Day. Two pages చదివి ఈ Diary రాస్తున్న... ఇప్పటివరకు ఐతే బాగానే అనిపించింది చదవడం. 

Books చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంటారు..  ఈ  book వల్ల నేను ఏం నేర్చుకుంటానో ఈ Diary లో రాస్తూ ఉంటా. మీరు చదువుతూ మీ ఆలోచనలని Comment చేస్తూ ఉండండి. అలాగే మీరు ఏదైనా Book చదువుతూ ఉంటె దాని గురించి చెప్పండి ఈ " Book Life " Diary లో....