Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
నమస్తే అండి.
నేను మీ ఇందు. మళ్లీ ఈరోజు డైరీ తో వచ్చేసా.
యాక్చువల్లీ నేను నా డైరీ రాసే టైమింగ్స్ 11 to 1:00. కాకపోతే ఈరోజు చిన్న విషయం ఇప్పుడే రాయాలని ఉంది.
మీతో కూడా అది షేర్ చేసుకుందామని కాస్త త్వరగా వ్రాస్తున్న...
రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నన్ను తను వర్క్ చేస్తున్న షార్ట్ ఫిలింలో కాస్త స్క్రిప్ట్ వర్క్ అండ్ డైలాగ్స్ రాయమని అడిగింది.
ఓకే. మనకి కూడా ఎప్పుడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా!
Why don't we try.. Why don't we give a chance అని ఒప్పుకున్నాను.
అలాగే వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. Out of excitement ఏమో! ఆ ఫలానా అమ్మాయి, మై ఫ్రెండ్, living legend అనుకోకుండా కొంత స్క్రిప్ట్ కు పిక్స్ తీసి.. Instagram లో పెట్టి.. మై నెక్స్ట్ మూవీ అని ఒక పోస్ట్ పెట్టింది. ఏదో రీల్ చూస్తున్నప్పుడు,
ఒక చిన్న నోటిఫికేషన్ తో.. ఆ పోస్ట్ ని చూసిన ఆ క్షణం. నాలో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది. ఏంటి క్రెడిట్ ఇవ్వలేదు?
అరే ఇంత చేసిన నాకు క్రెడిట్ ఇవ్వకపోవడం ఏమిటి? అని.. ఆరోజు ఎంతలా ఫీలయ్యానంటే నేనేదో ఆముక్తమాల్యద రాసి..
దానికి ముందుమాట., వెనుక నా పేరు రాయలేదు అన్నంత బిల్డప్ ఇచ్చాను.
చాలా ఫీల్ అయిపోయి, అదేంటి ఇలా జరిగింది. ఇదేంటి అలా జరిగింది అని అంటూ ఆ క్షణంలో చాలా నెగిటివ్గా థింక్ చేశాను.
సరే ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా! ఈరోజు జర్నలిస్ట్ ప్రేమతో అనుదీప్ కె.వి ఇంటర్వ్యూ చూశాను.
చాలా బాగుంది. చాలా నేర్చుకున్నాను కూడా. ఆ ఇంటర్వ్యూలో స్పెసిఫిక్ గా తను మెన్షన్ చేసింది ఏంటి అంటే.. జాతి రత్నాలు మూవీకి అందరూ కలిసి వర్క్ చేసాం..
ఎలా అయితే అనుదీప్ కష్టపడ్డాడో, అలాగే నాగ అశ్విన్ కూడా కష్టపడ్డాడు. సినిమా ఎడిటింగ్ అయ్యేటప్పుడు క్రెడిట్ టు నాగ అశ్విన్ అని రాద్దాము అనుకున్న సమయంలో..
నేనేం చేశాను. అంతా మీరే చేశారు అని ఒక మాట అన్నాడట. ఆ ఒక్క మాటతో అనుదీప్ కు నాగ అశ్విన్ చాలా ఎత్తుకు ఎదిగిపోయినట్టు అనిపించింది.
అదే ఒక మాట నాకు ఇప్పుడు చాలా నేర్పించింది.
Never ever work for credits. Never ever expect some one to recognize you.
ఎందుకంటే when your content/ hardwork has worth., recognition దానికి అదే వస్తుంది.
ఒకళ్ళు credit ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సక్సెస్ నీది అన్న తర్వాత.. నువ్వు fame / lime light లోకి వస్తావు.
ముందే క్రెడిట్ ని ఆశిస్తే.. ఏమి జరగదు.
ఈరోజు ఈ lesson నేర్చుకున్న...ఎన్ని lessons నేర్చుకున్న., ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవడానికి మిగిలిపోతూనే ఉంటుంది.
ఎప్పటికి నేర్చుకుంటానో.. సర్లేండి నెమ్మదిగానే నేర్చుకుందాం. Bubyee.
-మీ ఇందు✍????