Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Indu jagannadh

Page No: 1 | Views: 413 |  3

ఇన్నాళ్లు చాలానే కథలు రాశాను. కాకపోతే.. 

నా కథ నాకు, రోజు కొత్తగానే ఉంటుంది. 

నాకు తెలిసిన నేను ఐన సరే,  రోజూ నాకు కొత్తగానే కనిపిస్తూ ఉంటాను. 

ఏమి చిత్రమో కదా!  2023 అయిపోతుందా? 

అలా ఎలా 10 నెలలు అయిపోయాయి.

ఇంకొక రెండు రోజుల్లో 2023 మాయమైపోతుంది అనగానే అసలు ఏం చేసామా అని వెనక్కి తిరిగి ఒక్కసారి చూడాలనిపించింది. 

 

2023 నాకొక స్పెషల్ ఇయర్ ఎందుకంటే.. 

ఈ జీవి, ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజులాగే ఈరోజు కూడా రోజు మొత్తంలో జరిగిన దినచర్యని రాద్దాం అని డైరీ తీశాను. 

కాకపోతే, ఎందుకో ఈరోజు ఈ డైరీని మీ ముందు ఉంచాలని అనుకున్నాను

ఇలా ఈ DAIRYSOULS ద్వారా.. 

కష్టాలు లేని వారు ఎవరు ఉన్నారు చెప్పండి. అందులో మనిషి జన్మ! 

కష్టం చిన్నది అయినా..భూతద్దంలో పెట్టి చూడడం అలవాటు మన మానవ జన్మకు.

అలాగే ఎన్నో రోజులు, ముఖ్యంగా రాత్రుళ్లు కన్నీటితో గడిపాను. Pain peaks Ki వెళ్ళిందేమో! 

ఒకానొక saturation point వచ్చిందేమో! కన్నీళ్ళు ఆగిపోయాయి. కష్టం తలుచుకొంటే.. నవ్వు వచ్చే stage కి reach అయ్యాను. బహుశా అంతకు మించి, యే మనిషి ఏడవలేడేమో! తెలియదు మరి..

 

అలా కొన్ని రోజులు రాయడానికి బ్రేకులు పడ్డాయి. అప్పుడు వచ్చాయి కొన్ని నోటిఫికేషన్స్.

How are you? Where are you?

What happened? Why aren't you writing these days అంటూ....

చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది.2019 నుండి నేను కథలు రాస్తున్నా సరే..ఈ 2023 లోనే బాగా పాపులర్ అయ్యాను.

నా వైదేహి సిరీస్ ద్వారా..ఎంతలా అంటే.. ఎపిసోడ్ ఇవ్వడం కాస్త లేట్ అయితే..ఫోన్ కాల్స్, మెసేజెస్ వచ్చేస్తూ ఉండేవి.

అలా 2023 ఇంకాస్త దగ్గర అయ్యింది. 2023 చాలా నేర్పింది. కాలం స్నేహితురాలు అయ్యిందంటే మీకు కాస్త విచిత్రంగా ఉందేమో!

కానీ కాలమే నా గాయాలకు మందు పూసినప్పుడు, కాలమే నా స్నేహితురాలు అనడంలో విచిత్రం ఏముంది?

చాలా విషయాలు ఉన్నాయి.. మీతో పంచుకోవడానికి..

కాస్త భరించండోయ్..  రాబోయే రోజుల్లో మన ఈ ప్రయాణం మరింత ఆహ్లాదంగా ఉంటుందనే ఆశతో.. 

మీ ఇందు ✍????.

Mi diary chadhvadaniki chaala baagundhi... mi next story kosam waiting

Book Life

Nice Waiting for next episodes

Sravani