Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

పవన్ కళ్యాణ్ డైరీ

Page No: 2 | Views: 197 |  0

         

Pawan Kalyan Diary ::

ఇది నా కథ....

నాకోసం నేను రాసుకుంటున్న కథ....చిన్నతనం నుండే ఒంటరితనానికి బానిసై చదువుమీద శ్రద్దలేక ఆస్తమా అనే అనారోగ్యంతో బాధపడుతూ చదువుమీద శ్రద్ధ చూపలేకపోయా.....

నాన్న సాధారణ కానిస్టేబుల్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం..... అమ్మ అంజన దేవి అన్నీ విధాలుగా ప్రోత్సహించేది......

అనారోగ్యం కారణంగా 10వ తరగతి పరీక్షలు చాలా కష్టంగా గట్టెక్కాయి ....ఆ తరువాత ఇంటర్మీడియట్ కళాశాలలో చేరాను. ...కాలేజి పుస్తకాలకన్నకూడ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటానికి ఎక్కువగా ఇష్టపడేవాన్ని....అందులో కొన్ని గాంధీగారు రాసిన సత్యశోధన.....నన్ను చాలా ప్రభావితం చేసింది.....సరిగ్గా ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు చూసి రాసే అవకాశం వచ్చినా ఒక 5 నిమిషాలు కళ్ళుమూసుకొని ఆలోచించాను....

నన్ను ఎవరో ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది ఇలా... "చూసిరాయడానికేనా గంటలతరబడి నా పుస్తకం చదివింది అని"....అంతే ఇంకా కళ్ళు తెరిచి నాకు వచ్చింది రాశాను.....సరిగ్గా ఫలితాల్లో అర్హత సాధంచలేకపోయిన.... అమ్మ నాన్న , అన్నయ్యలు ఒక్కమాట కూడా అనలేదు.....

నన్ను ప్రోత్సహించడానికి మా అన్నయ్య నాగబాబు గారు ఒక పుస్తకం తెచ్చిచ్చారు...అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.....ఆ తరువాత ఏదో చేయాలి అన్న పట్టుదల పెరిగింది....అన్నయ్య అప్పుడే నీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోమంటే 30రంగాలు అనగా సంగీతం, భాషలు నేర్చుకోవడం వంటివి ఎన్నో చేసాను....కానీ వేటిలో  కూడా ఆసక్తి వుండేది కాదు.....

చివరగా ఎటూ తేల్చుకోలేక మా అన్నయ్య చిరంజీవి, దగ్గరికి వెళ్ళాను....సరిగ్గా అప్పుడే అన్నయ్య,  వదినమ్మ నాకో సలహా ఇచ్చారు ...నటుడిగా రాణించు అని.....అన్న వదినల మాట ప్రకారమే మనస్ఫూర్తిగా ఒప్పుకొని సినీ రంగంలో శిక్షణ తీసుకుని అడుగుపెట్టా.....

 

Follow this diary for next page of his Diary....

((పవన్ కళ్యాణ్ చిన్నప్పటి విషయాల గురించి మీకు తెలిసిన విషయాలు Comment లో చెప్పండి.))