Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Gayathri K

Page No: 1 | Views: 253 |  0



నా పేరు గాయత్రి...మా అమ్మ నాన్నకి ఏకైక గారాల ముద్దుగుమ్మని... 🥳🥰

Btech చదువుతున్నా. ప్రస్తుతం ఐతే అమ్మ చేతి వంట తింటూ... చక్కగా College Life ని enjoy చేస్తున్న... చదువు అవ్విన తరువాత పెద్ద జాబ్ చేసిన చిన్న జాబ్ చేసిన ... ఒక Business ఏదైనా Start చేసి అందులో Success అవ్వాలి and మా అమ్మ నాన్నలను హ్యాపీగా చూసుకోవడమే నా Dream. మాది ఒక చిన్న Middle Class Family. కానీ మా అమ్మ డాడీ, ఆ Middle class లో ఉండే బాధలు తెలీకుండా కావాల్సినవన్నీ ఇచ్చి ఒక Luxury Life ని ఇచ్చారు... వాళ్ళకి 1000 times తిరిగి ఇచ్చి ఒక మంచి Life ఇవ్వాలనేది నా Dream.. 

Parentsని సంతోషంగా చూడటం కన్నా వేరే Happiness మనకి ఏముంటుంది చెప్పండి. అంతే కదా...!! 

 ఇంకా నా గురించి చెప్పాలి అంటే Instagram లో చిన్న చిన్న reels చేస్తూ ఉంటా (Miss _ Telugu _ Ammayi ) అని ఉంటుంది.. . ఆ పేరు వెనక ఉన్న story ని తర్వాత పేజీలో చెప్తా... ఒక అమ్మాయి Social Media లో ఉంది అంటే కొన్ని కొన్ని challenges Face చెయ్యాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని మాటలు ఎదురుకోవాల్సి వస్తుంది. అవి అన్ని దాటుకుని మా Parents, కొంత మంది Friends Supportతో ముందుకి వెళ్తున్న. అనే వాళ్లు అంటూనే ఉంటారు లెండి. వాళ్లని పట్టించుకుంటూ ఉంటే, వాళ్లు అనుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటారు. మనం వెనక ఉండిపోవాలి. ఇదే నమ్ముతా నేను☺

 

 హలో అందరికి... నా డైరీ లో మొదటి పేజీ తెరిచిన మీ అందరికి నమస్తే...!!! 🙏🏼 అప్పట్లో డైరీ చాలా మంది రాసుకునేవారు. ఇప్పుడు ఈ SocialMedia ప్రపంచంలో కొంచెం కష్టం లెండి. కానీ Diary Writing అనేది చాలా మంచి అలవాటు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఇప్పుడు రాసుకున్న మధుర జ్ఞాపకాలు మల్లి మల్లి చదువుతూ ఉంటే అబ్బా ఆ feel భలే ఉంటుందిలే... కావాలంటే మీరు కూడా రాసి చూడండి ఒకసారి.... మీకు Time లేదు అంటారా..!!?? ఏం పర్లేదు.... నాలా Diarysouls Team help తీసుకుని రాయించుకోండి.... . 

 చాలా చాలా రాసుకోవాలి నా ఈ డైరీ లో .... 

తర్వాత పేజీలో మళ్లి కలుద్దాం.... 😀