Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
ఒక పల్లెటూరు లో మొదలవుతుంది ఈ కథ. ఒక పిల్లాడు సైకిల్ చక్రం తో ఆడుకుంటూ ఇంటికి వెళ్తుంటాడు.
అ పిల్లాడికి తను చూసిన ఒక వ్యక్తి గుర్తువస్తాడు.. ఎవ్వరు ఎందుకు అనేది అ పిల్లాడు కి మాత్రమే తెలుసు.
ఆ వ్యక్తి పేరు నిఖిల్ వేదవ్యాస్. ఆరడుగులు లేకపోయినా దూరం నుంచి అలానే ఉంటాడు ఒక మోస్తరు అందగాడే.
చదువుకున్నవాడు.
అమ్మ,నాన్న తప్ప వేరే లోకం తెలియని వాడు. ఉదయం లేవటమే దేవుడికి దండం పెట్టుకోవటం అలవాట్లు లేని
నాస్తికుడు. నిఖిల్ చదువు అయిన వెంటనే ఉద్యోగం కోసం పట్నం వెళ్తాడు.
నిఖిల్ పట్నం చేరుకొని స్నేహితుల సహాయం తో వాళ్ళ రూమ్ లో ఉంటాడు. రోజు ఉదయం లేచి బయటకి వెళ్లి
పేపర్ తెచ్చుకొని ఉద్యోగ అవకాశాలకోసం చూసుకుంటూ ఉంటాడు. రోజు లో కనీసం 6 ఇంటర్వ్యూ లు కి అయినా
వెళ్లి వచ్చే వాడు కానీ ఉద్యొగం మాత్రం రావటం లేదు. రోజులు గడుస్తూనే వున్నాయి .
నిఖిల్ వేరే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు.
ప్రతిరోజు లాగానే పేపర్ కోసం బయటికి వెళ్లి పేపర్ తీసుకోని వచ్చి పేపర్ చూస్తూ ఉంటాడు . పేపర్ లో ఒక అంశం
దగ్గర అతని కళ్ళు ఆగిపోతాయి. అ విషయం స్నేహితులకి చెప్పాలా వద్దు అ అని ఆలోచిస్తుంటాడు. అ అంశం ని
ఒకటికి పదిసార్లు చదువుతూ ఉంటాడు. అప్పుడే నిఖిల్ కూడా ఊహించని పరిణామం జరుగుతుంది .
నిఖిల్ పేపర్ లో చదివిన అంశం ఎన్ని సార్లు చూసినా అర్ధం అయి అర్ధం కానట్లే ఉంది. కాసేపటికి స్నేహితులు రూమ్
వస్తారు. నిఖిల్ స్నేహితులు కి చెప్పకూడదు అని నిర్ణయించుకుంటాడు. నిఖిల్ మొహం లో మార్పులు చూసి
స్నేహితులు అడుగుతారు . " ఏరా ఏమి అయింది. పేపర్ లో జాబ్స్ ఏమి దొరకలేదా " అని అడుగుతారు. నిఖిల్
నవ్వుతు " అ అవును రా దొరకలేదు " అని చెప్తూ నేను బయటకి వెళ్లి వస్తాను అంటాడు.
నిఖిల్ బయటకి వెళ్తాడు కానీ మనస్సు మనస్సు లో ఉండదు. అసలు ఏమి జరుగుతోందో అర్ధం కానీ స్థితి లో ఏమి
చేయాలో తోచక పాన్ షాప్ కి వెళ్లి ఒక సిగరెట్ వెలిగించుకుంటాడు నిఖిల్.
అ పేపర్ లో చూసిన విషయం ఎవ్వరికి చెప్పాలి అన్నా ధైర్యం చాలటం లేదు నిఖిల్ కి. అప్పుడే నిఖిల్ కి ఒక
ఆలోచన వస్తుంది. వెంటనే రూమ్ కి బయల్దేరతాడు. తన స్నేహితులు రూమ్ లో వంట చేసి తినటానికి కూర్చుంటారు.
స్నేహితులు అందరు కలిసి అ రోజు సినిమా కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు.
నిఖిల్ అ రోజు సినిమా కి వెళ్లి రావటం తో అలసిపోయి రూమ్ లో నిద్ర లోకి జారుకుంటాడు. తరువాతి రోజు
ఉదయం ఎప్పటిలాగానే పేపర్ తీసుకుని ఉద్యోగాల వేట లో పేపర్ తిప్పుతూఉంటాడు. నిన్నటి రోజు చూసిన పేజీ
లో అదే చోట అదే అంశం మళ్ళీ కనపడుతుంది. నిఖిల్ కి తల తిరిగినంత పని అవుతుంది. ఆలోచనలు రకరకాలు
గా వెళ్తూవుంటాయి.
నిఖిల్ కి ఒక అనుమానం వస్తుంది నిన్న పేపర్ తన స్నేహితులు కూడా చూసి వుంటారు కదా. ఈ రోజు వరకు వాళ్ళు
నన్ను ఎందుకు ఏమి అడగటం లేదు? వాళ్ళ పని లో వాళ్ళు వుంటూ చాల మాములు గా మాట్లాడుతున్నారు తనతో.
నిఖిల్ ని తన స్నేహితులు అ విషయం గురించి ఎందుకు అడగటం లేదో ముందు తెలుసుకోవాలి అనుకున్నాడు. అ
రోజు మధ్యాహ్నం రూమ్ లో అందరు ఉండగా పేపర్ తీసి తన స్నేహితులకి చూపిస్తూ తను చూస్తున్నాడు. అందరు
ఉద్యోగ ప్రయత్నాలు లో ఉన్నవాళ్లే అందరు ఒకో పేజీ తీసుకోని చూస్తున్నారు.
స్నేహితులు పేజీలు తిప్పుతున్నారు తను చూసిన పేజీ దగ్గరకి వచ్చేటప్పటికి నిఖిల్ గుండె వేగంగా కొట్టుకోవటం
మొదలు పెట్టింది. తన స్నేహితులు పేజీ ని మాములు గా చూసి పక్కకి తిప్పేశారు. వెంటనే నిఖిల్ పేపర్ తీసుకుని అ
పేజీ చూశాడు. తను చూసిన విషయం చూసి తన స్నేహితులని చూస్తాడు.
నిఖిల్ ని తన స్నేహితులు చూసి " ఏంటి రా అ బిత్తర చూపులు ఏమి అయింది బలవంతం గా కూర్చోపెట్టి మరి
పేపర్ చూడమని చెప్పావు " కానీ పేపర్ ఏమి లేదు కదా రా..అన్నారు. నిఖిల్ కి అ మాట వినగానే చుట్టూ వున్న
ప్రపంచం ఆగిపోయినంత పని అయినట్లు మనస్సు చాల ఇబ్బంది పడ్డాడు.