Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Diarysouls

Page No: 1 | Views: 244 |  1

బోనాల పండుగ వెనుక ఉన్న కథ :: 🙏


     


తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ బోనాల పండుగ. దీని వెనుక కొంత మంది కొన్ని విధాలుగా చరిత్ర చెప్తూ ఉంటారు... అందులో ఒకటి రెండు కథలు మీకోసం.... 1813లో ప్లేగు అనే వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతూ ఉంటారు తెలంగాణలో. దీనికి ముందే ఇక్కడ ఉన్న కొంత మంది సైనుకులని మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయినికి బలగం కోసం వెళ్తారు ... వాళ్లు ఇక్కడ ప్లేగ్ గురించి తెలుసుకుని అక్కడ శివుడు రూపంలో ఉన్న మహంకాళి దేవిని కోరుకున్నారు అంటా ఇలా.... ఈ వ్యాధి త్వరగా తగ్గిపోతే.... ఉజ్జయిని మహాంకాళి దేవత రూప విగ్రహాన్ని ఈ నగరంలో ప్రతిష్టిస్తామని అనుకుంటారు. ప్రార్ధిచ్చిన్నట్టుగానే వ్యాధి తగ్గడంతో, వాళ్లు ఇక్కడికి వచ్చాక ఉజ్జయిని గుడిని ఇక్కడ నిర్మిస్తారు.... అప్పటినుంచి దేవుడికి బోనాలు సమర్పించడం సంప్రాదాయంగా జరుగుతూ వస్తుంది. 

బోనం అంటే భోజనం. ఒక మట్టి కుండలో అన్నం వండి దేవికి సమర్పించడమే బోనాలు పండుగ. 

 మరొక కథగా చెప్పాలి అంటే.... .... 

 July /August లో వచ్చే ఆషాడం మాసంలో మహాంకాళి దేవి తన పుట్టింటికి వెళ్తుంది అని నమ్ముతారు. ఈ కాలంలో దేవికి బోనాలు అర్పించడం చాలా మంచిది అంటారు. ఇది ఎలా అంటే పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చినప్పుడు, పోతురాజు గా అన్నయ్యలు తమ్ముళ్లు అలాగే ఇంట్లో వాళ్లంతా తనకి వైభవంగా స్వాగతం పలికి, తనకి బోనం సమర్పించి అందరూ ప్రేమానురాగాలతో సంతోషంగా పండుగలా జరుపుకోవడం లాంటిది.

-----------------

" మీకు తెలిసిన బోనాల కథను అలాగే మీరు ఎలా జరుపుకుంటారో Comment లో చెప్పండి.... లేకపోతే 9989278282 కి Call / whatsapp చేసి చెప్పండి. మీకు బదులుగా నేను రాస్తాను. "

Maadhi Andhra.... Last year Bonalu pandagaki akkadey unna...😇 Chaala baaga jaruguthundhi pandaga akkada. Nijam cheppali antey naaku appudu Bonala pandaga antey ento poorthigathelidhu. Kaani ippudu e story tho ippudu baaga ardham avvindhi. Thanks. Missing to be there this year.  

V.V.S Manogna