Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
హాయ్ నేను సావిత్రి..
చిన్నప్పటినుండి చాలా గారంగా,ముద్దుగాపెరిగినదాన్ని..!నాకొక చెల్లి, తన పేరు దివ్య..!తను అమ్మ నాన్నల దగ్గర చిన్నప్పటి నుండి ఉంది, అమ్మ నాన్న పరిస్థితి తెలుసుకునే పిల్ల!మరీ నేనేమో అమ్మమ్మగారింట్లో పెరుగుతూ, ఉన్నప్పటికీ కూడా అన్నీ మా మావయ్య భార్య
నాకింద చాకిరీ చేస్తుండేది తన కూతురు అనుకుని. అలానే 2వ తరగతి అమ్మమ్మ గారింటి దగ్గర పూర్తి చేసి.. ఇంక అమ్మ నాన్న మీద బెంగతో
వాళ్ళింటికి వచ్చేసా! వచ్చాక అక్కడ
నా చిట్టి చెల్లెలు కనిపించింది!
ఎవరూ ఈ అమ్మాయి అనుకున్న!!
చిన్నప్పుడు నుండి కలిసి లేముగా
అందుకే తెలియదు తనెవరో!
అలా చూసిన మొట్టమొదటే అనుకున్నా..
నాలాగే అల్లరి పిల్ల అయ్యుంటుంది అని.
కానీ అలా కాదు.. సైలెంట్ గా ఉంటుంది,
అమ్మ నాన్న ఏం పెడితే అదే తినేది,
నాకన్నా తెలివైంది కూడా!
చాలా ప్రేమ చూపించేది, నేనంటే ప్రాణమే..!
అలాగని సైలెంట్ ఉండేది కాదు, రోజూ ఏదొక గొడవ పడేది.. నేను కూడా ఊరుకునేదాన్ని కాదనుకోండి!
అక్కాచెల్లెళ్లు అంటే ఆ మాత్రం ఉంటాయి కదా!
అన్నదమ్ములు ఎవరు లేరా?
Shashidhar