Email: diarysouls@gmail.com Phone:+91 9989278282
అలా పెరిగిన చిన్నతనం నాకింకా గుర్తుంది!
ఎప్పటికి గుర్తు ఉంటుంది కూడా.
అలా 4వతరగతి.. కి వచ్చిన నాకు కొత్తగా
గవర్నమెంట్ స్కూల్ లో
జాయిన్ అయ్యేది చాలా కొత్తగా,
సంతోషం గా అనిపించింది..
అయితే ఇక్కడ నాకు 3గురు స్నేహితులు
పరిచయం అయ్యారు..
అలా వాళ్ళతో 10వ తరగతి
వరకు చదువుకున్న!! అయినా వాళ్లు కూడా నాకెప్పుడు గుర్తుంటారు..! నేనే వాళ్ళకి గుర్తు ఉండనేమో!!ఏదేమైనా వాళ్ళు నా స్నేహితులు కాబట్టి నేను వదిలేది ఉండదు అనుకోండి..!
మా నాన్నమ్మ వాళ్ళు కర్ణాటక సరిహద్దుల్లో
ఉండేవారు..!వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాళ్ళు..!! నాకు చాలా ఆనందంగా అనిపించేది.. అనుకున్నవి
జరగడం కష్టం ఎవరికైనా సరే, కానీ..
నాకు నా పేరుమీద ఏం పని
తలపెట్టిన సరే డబ్బు సమకూరేది..
అదొక అదృష్టం అని చెప్పాలి..!
❤️❤️❤️
Niveditha