Email: diarysouls@gmail.com     Phone:+91 9989278282

Hide Error message here!

Forgot your password?

Hide

Lost your password? Please enter your email address. You will receive a link to create a new password.

Error message here!

Back to log-in

Shreyas Chaitanya Neha

Page No: 1 | Views: 160 |  0


        


రేయ్ Shreyas... 

ఇది నీ కోసం మేము రాస్తున్న డైరీ రా... ఇందులో నీ Childhood memories అన్ని రాయడానికి try చేస్తాము నేను మీ అమ్మ... నువ్వు చేసే చిలిపి పనులు, నువ్వు వేసిన మొదటి అడుగు, నీకు నచ్చిన బొమ్మ, నిన్ను చూసుకునేటప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు.🤣. నీకు తీసిన photos గురించి. ఇలా అన్ని. 

 నిన్ను నేను మొదటిగా కొడుకులా కన్నా నాన్న లా ఎక్కువ భావించాను. పుట్టింది అబ్బాయి అనగానే మీ తాతయ్యనే గుర్తొచ్చారు నాకు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు, చేతుల్లోకి తీసుకున్నప్పుడు నాకు తెలీకుండానే నా కళ్లలో నీళ్లు. కాని ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. నీ చిన్ని చిన్ని చేతులు కాళ్లు, ఎత్తుకోవడానికి ఏదో తెలియని భయం. 😂. 

 23-08-2024 :: రేయ్ ఈరోజు మనం తిరుపతి వెళ్తున్నాం రా. ఇది నీ First Devotional Tour అనుకో. నీకు పుట్టు తల తీయించుదాం అని తీసుకెళ్తున్నాం.